గుంటూరు GGHలో సీటీ స్కాన్ సేవలు ప్రారంభం - NEW CT Scan Center at Guntur GGH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 10:50 PM IST

thumbnail
గుంటూరు వాసులకు తీపి కబురు - జీజీహెచ్‌లో రూ.4 కోట్లతో సీటీ స్కాన్ సెంటర్ ప్రారంభం (ETV Bharat)

Union Minister Pemmasani Inaugurated CT Scan Center at Guntur GGH : గుంటూరు వాసులకు కూటమి నేతలు తీపి కబురు చెప్పారు. జీజీహెచ్​లో పేదలకు అధునాతన వైద్య సేవలందించేందుకు కొత్త సిటి స్కాన్ సెంటర్ ప్రారంభించినట్ల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దీన్ని 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే నాట్కో ఫార్మా కంపెనీ 45 కోట్ల రూపాయలతో జీజీహెచ్‌ లో క్యాన్సర్ కేంద్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్న పెమ్మసాని, పేదలకు అన్ని విధాలా మెరుగైన వైద్య సేవలందిస్తామని స్పష్టం చేశారు.

జీజీహెచ్‌ పేదలకు వైద్య సేవలందించడంలో ముందుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్ధులు జీజీహెచ్‌ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల సహకారం అందిస్తున్నారని వెల్లడించారు. అదేవిధంగా నకిలీ మద్యం గంజాయి వల్ల యువత ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటోందని మంత్రి ఆదేదన వ్యక్తం చేశారు. సమగ్రమైన విధి విధానాలతో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.