ETV Bharat / state

పోలవరంలో నితిన్​, శ్రీలీల - "చెక్​పోస్టు దాటుకొని దూసుకెళ్లిన వాహనాలు"

అల్లూరి సీతారామరాజు జిల్లాలో సినిమా షూటింగ్​ సందడి

Film Shooting In Alluri sitharama Raju District
Film Shooting In Alluri sitharama Raju District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 1 hours ago

Film Shooting In Alluri sitharama Raju District : ఎక్కడైనా సినిమా షూటింగ్​ అంటే ఆ ప్రాంతాల్లో సందడి నెలకొంటుంది. ప్రజలంతా అక్కడకు చేరి వినోదం చూస్తుంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో సినిమా చిత్రీకరణ జరిగింది. దీంతో అక్కడంతా సందడి నెలకొంది. పోశమ్మగండి వద్ద మంగళవారం ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ఆ చిత్ర బృందం కొన్ని సన్నివేశాలను షూట్​ చేశాారు. హీరో నితిన్, హీరోయిన్‌ శ్రీలీల నటిస్తున్న ఈ సినిమాలో కొంత భాగాన్ని ఇక్కడ నిర్మిస్తున్నట్లు సమాచారం.

పంటుపై కార్లు : చిత్రీకరణలో భాగంగా ఏపీ టూరిజం శాఖకు చెందిన పంటుపై మూడు కార్లతో పోశమ్మగండి, పూడిపల్లి పరిసర ప్రాంతాల్లో గోదావరి నదిపై షూటింగ్​ నిర్వహించారు. సినిమాలోని సన్నివేశం కోసం పంటుపై ఉన్న కార్లు పంట భూముల్లో నుంచి చెక్‌ పోస్టును దాటుకుని వెళ్తున్నట్లు, గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వెనుక వైపున కొన్ని షాట్స్​ తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ సినిమా షూటింగ్​ జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రతినాయకులు, కొంతమంది రైతులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

బాలయ్య NBK 109 కోసం రాజస్థాన్‌ ఎడారి సెట్‌ - షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే? - NBK 109 Movie Rajasthan Set

యూట్యూబ్‌ స్టార్‌ అప్పలమ్మ - డైలాగ్స్​, ఫైట్స్​లో ఆల్ ​రౌండర్​!

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.