నకిలీ ఎరువులు - విత్తనాలపై ఉక్కుపాదం : కేంద్రమంత్రి పెమ్మసాని - Pemmasani Review Agriculture Sector

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 7:45 PM IST

Updated : Jun 30, 2024, 8:31 PM IST

thumbnail
వ్యవసాయంపై కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష (ETV Bharat)

Pemmasani Review on Agriculture Department in Guntur : నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించే వారిని వదిలిపెట్టమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల వద్ద ధరల పట్టికను ఉంచాలని చెప్పారు. మరోవైపు విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి రైతులకు అధిక ధరకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ సన్నద్ధతపై కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 

Pemmasani on Fake Seeds : రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా వీటిపై ఫిర్యాదులపై కంట్రోల్​ రూం ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. మరోవైపు జిల్లా సహకార బ్యాంకులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపడుతామని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్​ కుమార్ తెలిపారు. ఇందుకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Last Updated : Jun 30, 2024, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.