వాహనం ఢీకొని చిరుతకు తీవ్ర గాయాలు- మెరుగైన చికిత్స కోసం తిరుపతి 'జూ' కు తరలింపు - Unidentified Vehicle Hit Leopard
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 10:59 AM IST
|Updated : Feb 6, 2024, 9:37 PM IST
Unidentified Vehicle Hit the Leopard in Penukonda : సత్యసాయి జిల్లాలో గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. జిల్లాలోని పెనుకొండ పట్టణ శివారులోని ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిరుతకు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న చిరుతను స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ డీఆర్ఓ శివరాం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చిరుతను పుట్టపర్తిలోని కరుణ సొసైటీకి తరలించారు.
సత్య సాయి జిల్లా పెనుకొండ RDO చెక్‌పోస్టు వద్ద గాయపడిన చిరుతను అటవీశాఖ అధికారులు పుట్టపర్తికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చిరుత గొంతు దగ్గర, వెన్నెముక, పక్కటెముకలు తీవ్రంగా గాయమైందని అధికారులు వెల్లడించారు. రక్త నమునాలు సేకరించామని ల్యాబ్ రిపోర్టులు వచ్చిన అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించనున్నట్లు జిల్లా అటవీ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.