ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు- నేటి నుంచి ప్రత్యేక పుష్పార్చన - Ugadi Celebrations in bejawada - UGADI CELEBRATIONS IN BEJAWADA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-04-2024/640-480-21183706-thumbnail-16x9-ugadi-vasantha-navratri-celebrations-started-in-bejawada.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 5:07 PM IST
Ugadi Celebrations Started in Bejawada Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీక్రోధి నామ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారు జామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణలు నిర్వహించారు. వసంతోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రోజుకో రకం పుష్పాలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం దుర్గామల్లేశ్వరస్వామి వార్ల వెండి రథోత్సవం జరగనుంది.
వసంత ఉత్సవాల్లో భాగంగా ఉగాది సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం 8 ఉచిత బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారికి మహా నివేదికన సమయంలో వీఐపీ దర్శనాలను నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు వీఐపీతోపాటు అన్ని ప్రోటోకాల్, వృద్ధులు, వికలాంగుల దర్శనాలను నిలిపివేశారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.