అల్లూరి జిల్లాలో విషాదం - పిడుగుపడి ఇద్దరు మృతి - Two persons dead in thunderstorm - TWO PERSONS DEAD IN THUNDERSTORM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-04-2024/640-480-21177296-thumbnail-16x9-two-persons-dead-in-thunderstorm.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 7:57 PM IST
Two Persons Dead in Thunderstorm: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం వనగుమ్మ పంచాయతీ అసరాడ గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో ఉన్న పశువులను తీసుకు రావడానికి కొండకు వెళ్లిన ఇద్దరు యువకులు పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మృతులు కిరంబో గ్రామం పాంగి సుఖదేవ్, మరొకరు ఒడిశాకు చెందిన పప్పుర్ మెట్టగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను చూసిన బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఓవైపు ఇప్పటివరకు ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ మార్పుతో కాస్త ఉపశమనం కలిగిందనుకుంటే అంతలోనే పిడుగుపాటుకు ఇద్దరు యువకులు బలి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం మరో రెండ్రోజులపాటు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.