చలికి తాళలేక కుంపటి - తెల్లారేసరికి గాల్లో కలిసిన ప్రాణాలు - TWO PEOPLE DIED BY COAL FIRE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2024, 3:35 PM IST
Two People Died By Coal Fire In Alluri Sitharama Raju District : చలి నుంచి తప్పించుకునేందుకు ఇంట్లో వెలిగించిన బొగ్గుల కుంపటి ఇద్దరి ప్రాణాలు తీసిన ఘటన అల్లూరి జిల్లాలో కలకలం రేపింది. అరకులోయలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నాయనమ్మ, మనవడు ఇద్దరు మృతి చెందటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. డుంబ్రిగూడ మండలం సోవా ప్రాంతానికి చెందిన బలరాం కుటుంబం అరకులోయలో కూలి పనులు చేసుకుంటూ అటవీశాఖ నివాస గృహాల్లో ఉంటోంది. శనివారం రాత్రి చలి కారణంగా బొగ్గుల కుంపటి పెట్టుకొని ఓకే గదిలో నాయనమ్మ చిలకమ్మ, మనవడు నాని నిద్రించారు.
ఉదయం 8 గంటలవుతున్న గదిలో నుంచి బయటకు రాకపోవడంతో బలరాం కుటుంబ సభ్యులు తలుపులు గడియా విరగగొట్టి లోనికి ప్రవేశించారు. గదిలో నాయనమ్మ, మనవడు ఇద్దరు మిగతా జీవులుగా కనిపించారు. బొగ్గులు కుంపటి వల్లే ఊపిరాడక మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో బలరాం కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.