అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మైనర్ల ఆత్మహత్య- ప్రేమికులుగా అనుమానిస్తున్న పోలీసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 10:43 PM IST

Two Lovers committed Suicide at Araku: అనుమానస్పద స్థితిలో యువతీ, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ చోటు చేసుకుంది. అరకులోని బొండాం పంచాయతీ కరకవలస సమీపంలోని కొండపై ఉన్న చెట్టుకు యువతీ, యువకుడి మృతదేహాలు వేలాడుతుండటాన్ని ఆదివారం సాయంత్రం పశువుల కాపరులు గుర్తించారు. కరకవలస- కటిక జలపాతం మధ్యలో ఉన్న కొండపై ఈ ఘటన జరిగింది. మృతుల వయసు ఇరవై సంవత్సరాల లోపు ఉన్నట్లు తెలుస్తోంది. వారు స్థానికుల సమాచారంతో అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు మైనర్లని పేర్కొన్నారు. 

మృతులు ఇద్దరూ రాజమండ్రి సమీపంలోని హుకుంపేట ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. యువతి 9వ తరగతి చదువుతుండగా యువకుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని ఫిబ్రవరి 27న ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. ప్రేమ విషయం ఇంట్లో చెబితే విడదీశేస్తారని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుల బంధువులు అనుమానిస్తున్నారు, ఆత్మహత్య విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేక ఎవరైనా హత్య చేసి వేలాడదీశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.