బుర్ఖా ధరించి భయపెట్టేలా ఆకతాయిల బైక్ స్టంట్స్ - తిక్క కుదిర్చిన పోలీసులు - Two Arrested Performing Bike Stunts
🎬 Watch Now: Feature Video
Published : Aug 20, 2024, 6:47 PM IST
Two Arrested For Performing Bike Stunts in Burqa : బుర్ఖా ధరించి బైక్‌పై పాదచారులను భయపెడుతూ స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులను హైదరాబాద్ ఐఎస్ సదన్ పోలీసులు అరెస్టు చేశారు. సంట్స్ చేస్తున్న యువకులకు సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 15న హైమద్ దానిష్, అబ్దుల్ వాసిఫ్ రోడ్డుపై స్టంట్స్ చేశారు. బుర్ఖా ధరించిన హైమద్ ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ కాలేజీ యువతులను భయపెట్టారు. చిన్న చిన్న గల్లీల్లో బైక్ స్పీడ్‌గా డ్రైవ్ చేశారు. బుర్ఖా ధరించి వికృత చేష్టలు చేశారు. వీరితో ఉన్న మరో ముగ్గురు స్నేహితులు ఇదంతా వీడియో తీశారు.
దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. సంట్స్ చేసిన వారితో పాటు సహకరించిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఎవర్ని వదలబోమని పోలీసులు హెచ్చరించారు.