జమ్మలమడుగులో అనసూయ సందడి - భారీగా తరలివచ్చిన యువకులు - Aakruti Shopping Mall
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 6, 2024, 3:54 PM IST
TV Anchor Anasuya at Jammalamadugu : ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో సందడి చేశారు. తాడిపత్రి రోడ్డులో ఏర్పాటు చేసిన ఆకృతి షాపింగ్ మాల్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం షాపింగ్ మాల్ మెుత్తం కలియ తిరిగారు. అక్కడున్న రకరకాల చీరలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, జమ్మలమడుగు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తన రాకను జమ్మలమడుగు ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి పెద్ద షాపింగ్ మాల్‌లు ఇక్కడికి రావటం స్థానికులకు ఎంతో ఉపయోగమని తెలిపారు. ఆకృతి షాపింగ్ మాల్ 50వ స్టోర్‌ని జమ్మలమడుగులో ప్రారంభించటం ఎంతో ప్రత్యేకతను చాటుకుందన్నారు.
అయితే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అనసూయ వస్తున్నారని యాజమాన్యం వారం రోజులుగా ప్రచారం చేసింది. దీంతో ఆమెను చూసేందుకు యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. చివరికి యువకులను అదుపు చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.