తుంగభద్ర డ్యామ్ వద్ద స్టాప్​లాగ్ ఏర్పాట్లు - జలాశయం వద్దకు గేటు విడిభాగాలు - Tungabhadra Dam Stop Log Gate Works - TUNGABHADRA DAM STOP LOG GATE WORKS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 1:55 PM IST

Tungabhadra Dam Stop Log Gate Works: తుంగభద్ర జలాశయంపై విరిగిపోయి కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త గేటు అమర్చడానికి రెండు విడిభాగాలు జలాశయంపైకి చేర్చారు. ఈనెల 10న టీబీ డ్యాం 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. డ్యాం గేటు విరిగిపోయిన కారణంగా ఇప్పటి వరకు 45 టీఎంసీల నీరు వృథాగా దిగువకు పోయింది. జలాశయంలో నీటి వృథాను అడ్డుకోవటానికి, విరిగిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు అమర్చాలని నిర్ణయించారు. విరిగిపోయిన గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉండటంతో ఇంతటి భారీ గేటు తయారు చేసి డ్యాం వద్దకు తీసుకురావడం కష్టమని భావించిన నిపుణులు ఐదు విడిభాగాలుగా గేటును తయారు చేయించారు. 

జలాశయం గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఐదు భాగాలుగా గేటు తయారు చేయించారు. జిందాల్ సంస్థలో తయారైన గేటుకు సంబంధించిన రెండు విడిభాగాలను అతికష్టం మీద ఇవాళ ఉదయం జలాశయం వద్దకు తరలించారు. భారీ వాహనంలో 2 విడిభాగాలను టీబీ డ్యాం కట్టపైకి చేర్చారు. నిన్న మధ్యాహ్నం డ్యాంపై 19వ నెంబర్ గేటు వద్ద కర్ణాటక రాష్ట్ర మంత్రి జమీర్ ఖాన్, అధికారులతో కలిసి పూజలు నిర్వహించారు. మరో మూడు విడిభాగాలను ఇవాళ రాత్రికి తరలించేలా టీబీ బోర్డు అధికారులు బళ్లారి పోలీసులను అనుమతి కోరారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి గేటు అమర్చే పనులు ప్రారంభించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.