ఏజెన్సీ ప్రాంతాల్లో తప్పని డోలీ మోతలు - రహదారి సదుపాయం లేక గిరిజనుల అవస్థలు - Tribals Carried Pregnant on Doli - TRIBALS CARRIED PREGNANT ON DOLI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 4:00 PM IST

Tribals Suffering From Not Road Facilities in Agency Areas : ఎన్ని ప్రభుత్వాలు మారినా పార్వతీపురం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేక కొమరాడ మండలంలోని గాజులగూడ నుంచి కెమిశిలకు ఓ గర్భిణిని డోలీపై మోసుకెళ్లారు. రెండు కిలోమీటర్లు డోలీపై గర్భిణిని తీసుకొచ్చి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని సంవత్సరాలుగా రహదారి సదుపాయం లేక అత్యవసర పరిస్థితిల్లో అవస్థలు పడుతున్నామని గిరిజనులు వాపోయారు. 

ఎన్నికల్లో రోడ్లు వేస్తామని ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా గెలిచిన తరువాత పట్టించుకోవడం లేదని గిరిజనులు పేర్కొన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా గిరిజన ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పి మోసం చేశారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అల్లూరి జిల్లాలో రహదారి సౌకర్యం లేక పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని డోలిపై 3 కిలోమీటర్లు మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పించి డోలీ మోతలు తప్పించాలని గిరిజనులు కోరుతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.