రహదారి కోసం 20ఏళ్లుగా పోరాటం- వేసుకున్న రోడ్డూను తవ్వేశారు! అధికారుల వైఖరిపై గిరిజనులు ఆందోళన - Tribals concern for road - TRIBALS CONCERN FOR ROAD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 8:16 PM IST
Tribals Protest for road in Satya Sai District : గ్రామానికి రోడ్డు వేయ్యాలని గిరిజనులు తల్లి, పిల్లలతో పాటు ఇంట్లో పెంచుకునే పశువులతో రోడ్డూపై బైఠాయించి ఆందోళనలు చేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుర్రపుకొండ తండా గ్రామాంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాలో మాట్లాడుతూ, ప్రధాన రహదారి నుంచి గుర్రపుకొండ తండాకు వేెళ్లేందుకు ఎటువంటి రహదారు లేదు. గ్రామానికి రోడ్డు వేయ్యాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోలేదని తెలిపారు. చివరికి గ్రామస్తులంతా కలసి పంట పోలాల్లోనే మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకొని దాదాపు 18 సంవత్సరాలుగా రాకపోకలు సాగిస్తున్నామని వెల్లడించారు.
కానీ, కొంత మంది ఆ భూమి తమదంటూ నిన్న( బుధవారం) రాత్రి మట్టి రోడ్డు పోడవున పెద్ద పెద్ద గుంతలు తవ్వారని తెలిపారు. ఉదయం వచ్చి చూసే సరికి రోడ్డు మెుత్తం గుంతలతో నిండిపోయింది. చివరికి కాలినడకన వెళ్లేందుకు కూడా దారి లేదు. దీంతో గ్రామస్తులందరూ రోడ్డుపైనే కూర్చోని ఆందోళన చేశారు. తమ గ్రామానికి రోడ్డు వేయ్యాలని డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై రాకోపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు గ్రామస్తులకు సర్దిచేప్పే ప్రయత్నం చేసిన వినలేదు. రోడ్డు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేంతవరకు నిరసనలు విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు.