గిరిజనులకు తప్పని డోలి మోతలు - సకాలంలో వైద్యం అందక మృత్యువాత - Tribal problems in Alluri district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 10:48 AM IST
Tribals Carried Doli for 12 Kilometers: రహదారులు లేక డోలిమోతలు తప్పడం లేదంటూ అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మడ్రాబుకి చెందిన గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లాలంటే కొండ ప్రాంతాల నుంచి 12 కిలోమీటర్లు డోలి మీద మోసుకెళ్లాలని వాపోతున్నారు. సకాలంలో వైద్యం అందక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా మాకు రోడ్లు వేసే పరిస్థితి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓట్ల కోసం మాత్రమే నాయకులు మా గ్రామానికి వస్తుంటారు కానీ మాకు అనారోగ్యం వస్తే పట్టించుకునే నాథుడే లేరని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేమే రోడ్లు సొంతంగా వేసుకుంటామని ఫారెస్ట్ అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు పలు దఫాలుగా వినతులిచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. పిల్లలు, తల్లులు అనారోగ్యానికి గురైతే రోడ్లు లేక డోలి కట్టుకొని వెళ్లేలోపే మార్గమధ్యలోనే మరణిస్తున్నారన్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి రహదారులు నిర్మించాలని వేడుకుంటున్నారు.