గిరిజన భాషా వాలంటీర్ల ఆందోళన- రెన్యువల్ ప్లీజ్ అంటూ ఆవేదన - గిరిజన భాషా వాలంటీర్ల ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 4:15 PM IST
Tribal Bhasha Volunteers Protest At ITDA in Alluri District : అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజన భాషా వాలంటీర్లు పాడేరు ఐటీడీఏ (ITDA) వద్ద ఆందోళన చేపట్టారు. సుమారు 500 మంది భాషా వాలంటీర్లు (Tribal Bhasha Volunteers) గిరిజనుల మాతృ భాషలయిన కోదు, కువిలను బాల్య విద్యార్థులకు బోధిస్తారు. గతంలో వీరిని తొలగించడంతో రెండేళ్లు పోరాటం చేయగా, 2023 ఆగస్టులో రెన్యువల్ చేశారు. ఈనెల 29తో వీరి గడువు ముగుస్తున్న నేపథ్యంలో తిరిగి రెన్యువల్ (Renewal) చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.
Tribal Bhasha Volunteers Strike : ఈ సందర్భంగా భాషా వాలంటీర్లు మాట్లాడుతూ అరకొర జీతాలు కనీస అవసరాలకు కూడా సరిపోవడం లేదని, పనికి తగిన వేతనం ఇవ్వాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రెన్యువల్ గురించి అధికారులు స్పందించడం లేదని వాపోయారు. తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లు (Demonda) నెరవేర్చాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.