సీఎం సభ కోసం దారి మళ్లింపు- వందల కి.మీ చుట్టూ తిరిగెళ్లాల్సి వస్తోందని లారీ డ్రైవర్ల గగ్గోలు - వాహనాల దారి మళ్లింపు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 4:22 PM IST

Traffic Diversion for CM Jagan Siddam Sabha: సీఎం​ సభ ఉందంటే సాధారణ ప్రయాణికులకే కాదు, ఇతర వాహనాల డ్రైవర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. జగన్​ సభ ఉందంటే వారి గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తిప్పలు తప్పవని బెంబేలెత్తిపోతున్నారు. అన్నొస్తే అవస్థలే అంటూ.. అధికార వైఎస్సార్సీపీ నేతల(YSRCP Leaders) తీరుతో ప్రజలు ఎప్పుడూ ఇబ్బందులు పడాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో నిర్వహిస్తున్న సీఎం జగన్​ 'సిద్ధం' సభ(CM Jagan Siddam Sabha)కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

People Problems with CM Jagan Tour: మామిళ్లపల్లి వద్దనున్న జాతీయ రహదారిపై దారి మళ్లించడంతో హైదరాబాద్ వైపుగా వెళ్లే వాహనాలకు 100 కిలోమీటర్ల దూరం పెరుగిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభ కోసం వాహనాలను దారి మళ్లించడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. దీంతోపాటు సీఎం సభ కోసం భారీగా బస్సులు తరలించటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలకు అధిక ఛార్జీలు చెల్లించి గమ్యస్థానాలకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.