'15ఏళ్ల నాటి వరద బీభత్సాన్నింకా మరిచిపోలేదు'- రేపల్లె వ్యాపారుల ముందుచూపు - Traders Precautions for floods - TRADERS PRECAUTIONS FOR FLOODS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-09-2024/640-480-22363835-thumbnail-16x9-traders-precautionary-measures-in-bapatla-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2024, 2:11 PM IST
Traders Precautionary Measures to Protect Their Shops From Floods in Bapatla District : బలహీనంగా ఉన్న కరకట్టలకు గండ్లు పడి వరద నీరు ముంచెత్తుతుందనే భయంతో బాపట్ల జిల్లాలోని రేపల్లె పట్టణంలో వ్యాపారులు తమ దుకాణాల ముందు మూడడుగుల ఎత్తున ఇసుక, సిమెంట్‌తో గోడలు నిర్మించుకున్నారు. పట్టణంలోకి వరద నీరు ప్రవేశించినా తమ దుకాణాల్లోకి రాకుండా అడ్డుకోవటానికి ఈ గోడల నిర్మాణాలు చేపట్టారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు, రేపల్లె మండలం రావి అనంతవరం వద్ద కరకట్టలు బలహీనంగా ఉండి కట్ట తెగి వరదనీరు ప్రవహిస్తే రేపల్లె పట్టణం ముంపు బారిన పడుతుందంటూ కలెక్టర్ వెంకటమురళి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రేపల్లె పట్టణంలోని వ్యాపారులు ఆప్రమత్తమ య్యారు. 15ఏళ్ల నాటి వరద బీభత్సాన్ని గుర్తుకు తెచ్చుకున్న వ్యాపారులు మరోసారి నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తగా దుకాణాల షట్టర్ల ముందు వరద నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటానికి గోడల నిర్మాణాలు చేపట్టారు.