'విశాఖలో ప్రభుత్వాన్ని నిలదీసేలా బ్యానర్లు'- విచారణ చేపట్టిన అధికారులు - TNSF Banner - TNSF BANNER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 5:07 PM IST

TNSF Banner Issue in Visakha East Constituency : విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీఎన్​ఎస్​ఎఫ్​ పేరిట బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. ఎంవీపీ బస్​ కాంప్లెక్స్​ సమీపంలో 8 ప్రశ్నలతో కూడిన బ్యానర్లు వెలిశాయి. ఇవి ప్రజలను ఆలోచింపజేసేలా ఉన్నాయి. వీటిని నగర వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. TNSF పేరిట బ్యానర్లను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

"విశాఖలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసింది ఎవరు? ఐపీఎస్​ పోలీస్​ అధికారుల స్థలాలను కూడా కబ్జా చేసింది ఎవరు? శవాలను పూడ్చే శ్మశానాలకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసింది ఎవరు? సిరిపురం కూడలిలో ఉన్న CBCNC క్రిస్టియన్​ ఆస్తులను కొట్టేసింది ఎవరు? ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చిన ఆశ్రమ స్థలాలను కాజేసింది ఎవరు? అధికార దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలు విలువ చేసే టీడీఆర్​ బాండ్లను కొట్టేసింది ఎవరు? ల్యాండ్​ కబ్జాలతో తల దూర్చి సొంత కుటుంబానికి సైతం రక్షణ కల్పించుకోలేని దుస్థితిలో ఉన్న ప్రజాప్రతినిధి ఎవరు? " వంటి ప్రశ్నలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.