వైసీపీ నేతలకు దమ్ముంటే షర్మిల అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: తులసిరెడ్డి - షర్మిల ప్రశ్నలకు సమాధానం చెప్పండి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 2:07 PM IST

Thulasi Reddy Fires on BJP: విభజన హామీల్లో పేర్కొన్న విశాఖ రైల్వేజోన్ (Visakha railway zone), దుగరాజపట్నం ఓడరేవు (Dugarajapatnam port), కడప స్టీల్ ప్లాంట్​ (Kadapa steel plant) ఏర్పాటు చేయకుండా బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ మీడియా ఛైర్మన్‌ తులసి రెడ్డి మండిపడ్డారు. ఈ హామీలన్నీ నెరవేర్చాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అధికార పార్టీపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తుంటే వైసీపీ నాయకులు ఆమెను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి దమ్ముంటే షర్మిల అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తులసిరెడ్డి(Tulasi eddy) సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కడప లోక్​సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ, టీడీపీ, జనసేన అంటగాకుతున్నాయని, ఆ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని తులసిరెడ్డి అన్నారు. ఈ నాలుగు పార్టీలు దుష్టచతుష్టయం పాత్ర పోషిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని తులసిరెడ్డి మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.