కొద్దిరోజుల్లో చేతికి పంట - అంతలోనే ధ్వంసం చేసిన దుండగులు - cotton crop destroyed - COTTON CROP DESTROYED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 5:56 PM IST

Cut the Cotton Crop in Sri Sathya Sai District : ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఆ రైతు. ఇక కొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంటను దుండగులు రాత్రికి రాత్రే నరికేెశారు. పొలంలో విగతజీవులుగా పడివున్న మెుక్కలను చూసి ఆ రైతు గుండె తరుక్కుపోయింది. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెెళ్తే, అగలి మండలం కెంకెర గ్రామంలో నరసింహరాజు అనే రైతు ఎకరం పొలంలో పత్తి పంటను సాగు చేశారు. పంట ఏపుగా పెరిగి కొద్ది రోజుల్లో చేతికి వస్తుందని అనుకునే లోపే నిన్న(శుక్రవారం) రాత్రి కొందరు దుండగులు చాలా వరకు పత్తి మెుక్కలను ధ్వంసం చేశారు. 

ఈరోజు ఉదయం పొలానికి వెళ్లిన రైతుకు నేలపై పడి ఉన్న మెుక్కలను చూసి గుండె తరుక్కుపోయింది. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో విలవిలలాడిపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకుని పంటను పరిశీలిస్తున్న సమయంలో రైతు కుటుంబసభ్యులు ఎస్సై కాళ్లమీద పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. లక్షన్నర రూపాయలు అప్పు చేసి పత్తి పంటను సాగు చేశామని వాపోయారు. మరి కొన్ని రోజుల్లో పంట చేతికందే సమయంలో ఎవరో ఉద్దేశపూర్వకంగానే  పంటను నాశనం చేశారని రైతు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.