జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం- ముగ్గురు యువకులు మృతి - Three Youths Died in Road Accident - THREE YOUTHS DIED IN ROAD ACCIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2024, 7:53 AM IST
|Updated : May 25, 2024, 9:05 AM IST
Three Youths Died in Road Accident : రాష్ట్రంలో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అని వాహనచోదకులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిత్యకృత్యమైన ప్రమాదాల కారణంగా వేలాది మంది వైకల్యం బారిన పడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు.
బైక్‌ను ఢీ పారిపోయిన గుర్తు తెలియని వాహనం : డోన్ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన దశరథ, తుగ్గలి మండలం లింగనేనిదొడ్డికి చెందిన ముని, ప్రభాకర్ ద్విచక్రవాహనంపై పెయింట్ పని నిమిత్తం డోన్‌కు వచ్చారు. పని ముగించుకొని వర్షంలో తిరిగి గ్రామానికి వెళ్తుండగా డోన్ జాతీయ రహదారిపై ఉంగరానిగుండ్ల వద్ద గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. గుర్తు తెలియని వాహనం ఆపకుండా పారిపోయింది. వారిని హైవే పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా ముగ్గురూ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దశరథ కు 8 నెలల క్రితం వివాహమైనదని, ఇతని భార్య 4నెలల గర్భవతి అని వారి బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.