మార్తాడులో పట్టపగలే చోరీ - 40 తులాల బంగారం, రూ.2 లక్షలు అపహరణ - Thieves Gold Robbery in House - THIEVES GOLD ROBBERY IN HOUSE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 3:27 PM IST

Gold And Cash Robbery in House at Martadu: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మార్తాడులో భారీ చోరీ జరిగింది. తులసమ్మ అనే మహిళ తిమ్మంపేటలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ శ్రీధర్​తో కలసి చోరీ జరిగిన ప్రాంతాన్నిడాగ్ స్క్వాడ్​తో పరిశీలించారు. 40 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు.  

స్థానికులు తెలిపిన వివరాల మేరకు బాధితురాలి భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతంలో ఉంటున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి వేలిముద్ర నిపుణులను రప్పించి ఆధారాలు సేకరించారు. ముగ్గురు దొంగలు ముఖాలకు నల్లటి దుస్తులు ధరించి వెళ్లారని ఓ విద్యార్థి పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపారు. ఇదే గ్రామంలో నెల రోజుల క్రితం మూడు ఇళ్లల్లో చోరీ జరగడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.