బ్యాంక్‌ చోరీకి యత్నించిన దుండగులు - సురక్షితంగా ఉన్నా నగదు - krishna district bank robbary

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 4:56 PM IST

Thieves Attempted to Rob Krishna District Co-operative Bank : కృష్ణా జిల్లా గన్నవరం మండలం బీబీగూడెంలో కృష్ణా జిల్లా సహకార సంఘం బ్యాంకులో దుండగులు చోరికి యత్నించారు. షట్టర్​ తాళాలు పగలగొట్టి బ్యాంక్​ లోపలికి ప్రవేశించారు. అనంతరం బీరువా తాళాలు పగులగొట్టి బ్యాంక్​ సామాగ్రిని ధ్వంసం చేశారు. బ్యాంకులో నగదు, రికార్డులు సురక్షితంగా ఉన్నాయని సిబ్బంది తెలిపారు.

Thieves Entered the Bank by Breaking the Locks : బ్యాంకు సెక్రటరీ విజయలక్ష్మీ చోరికి సంబంధించిన వివరాలను పేర్కొంది. రోజులాగానే శనివారం ఉదయం సెక్యురిటీ గార్డు బ్యాంక్​ తెరవడానికి వచ్చి చూస్తే గేటు తాళాలు పగలుగొట్టి ఉన్నాయని పేర్కొంది. దీంతో ఈ విషయాన్ని సెక్యురిటీ గార్డు తనకు తెలియజేసినట్లు తెలిపారు. బ్యాంకు వచ్చి పరిశీలిస్తే రికార్డులు అన్ని చిందరవందరగా పడినట్లు పేర్కొంది. దీంతో అప్రమత్తం అయ్యి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఘటనపై గన్నవరం పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బ్యాంకు చోరికి పాల్పడిన దుండగులను తొందరల్లోనే పట్టుకుంటామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.