విశాఖ తీరానికి విలాసవంతమైన 'ది వరల్డ్' నౌక - సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం - International Cruise Ship - INTERNATIONAL CRUISE SHIP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 10:28 AM IST
International Cruise Ship Arrived at Visakhapatnam Port : విశాఖ సాగర తీరానికి మరో విశిష్ట అతిథి విచ్చేసింది. 'ది వరల్డ్' అనే అంతర్జాతీయ క్రూయిజ్ నౌక తొలిసారిగా విశాఖ పోర్డుకు చేరుకుంది. క్రూయిజ్ నౌకలో సుమారు 80 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు పోర్టు అధికారులు ఘన స్వాగతం పలికారు. నౌకలో వచ్చిన విదేశీయులు స్థానిక కళాకారులతో సంప్రదాయ నృత్యాలు చేశారు. 'ది వరల్డ్ ' నౌకలో వచ్చిన విదేశీయులకు నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను తిలకించనున్నారు. సోమవారం రాత్రి విశాఖ పోర్టు నుంచి పోర్ట్ బ్లేయిర్ కు ది వరల్డ్ అంతర్జాతీయ క్రూయిజ్ నౌక బయలుదేరుతుంది. దీనిని చూడడానికి విశాఖవాసులు భారీ సంఖ్యలో పోర్టుకు తరలివచ్చారు.
విలాసవంతమైన ' ది వరల్డ్ క్రూయిజ్ నౌక విశాఖ పోర్టులోని అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్లో బెర్తింగ్ అయ్యిందని పోర్టు ఛైర్మన్ అంగముత్తు పేర్కొన్నారు. తూర్పు తీరంలో అంతర్జాతీయ క్రూయిజ్ నౌకలకు విశాఖపట్నం క్రూయిజ్ టెర్మినల్‌ను గమ్యస్థానంగా మారుస్తామని పేర్కొన్నారు. ఈ టెర్మినల్‌ను రూ.96 కోట్లతో ప్రపంచంలోనే ప్రత్యేకమైన క్రూయిజ్ నౌకల రాకపోకలకు అనువుగా నిర్మించామని అంగముత్తు తెలియజేశారు.