వీవీఐటీ కళాశాలలో "తంగలాన్‌" బృందం సందడి- విద్యార్థులతో కలిసి హీరో విక్రమ్‌ డాన్స్ - Thangalaan Team in VVIT College

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 12:52 PM IST

thumbnail
వీవీఐటీ కళాశాలలో "తంగలాన్‌" బృందం సందడి- విద్యార్థులతో కలిసి హీరో విక్రమ్‌ డాన్స్ (ETV Bharat)

Thangalaan Movie Team Buzz in VVIT College : గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీ కళాశాలలో "తంగలాన్" చిత్ర బృందం సందడి చేసింది. నటుడు విక్రమ్ (Actor Vikram) ప్రధాన పాత్రలో దర్శకుడు రంజిత్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హీరోయిన్ మాళవిక మోహనన్, నటుడు డానియల్ తో కలసి విక్రమ్ వీవీఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో తన క్యారెక్టర్‌ వినూత్నంగా ఉండబోతుందని హీరో విక్రమ్ తెలిపారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మంచి ఎమోషనల్ చిత్రంగా దర్శకుడు రంజిత్ రూపొందించారన్నారు. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి తన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని "తంగలాన్" చిత్రాన్ని అలాగే ఆదరించాలని ఆయన కోరారు. ప్రతి పనిలో కష్టం ఉంటుందని, ఇష్టంగా చేయడం ద్వారా విజయం అందుకోవచ్చని విద్యార్థులకు విక్రమ్‌ సూచించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అనంతరం చిత్రబృంద సభ్యులు విద్యార్థులతో కలసి నృత్యాలు చేస్తూ, సెల్ఫీలతో సందడి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.