ఫ్లెక్సీ తొలగించేందుకు అధికారుల యత్నం - బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత

🎬 Watch Now: Feature Video

thumbnail

Tension at BJP State Office in Vijayawada: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయం అడ్రస్ ఉన్న ఫ్లెక్సీకి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసినప్పటికీ కార్యాలయంలోని ఫ్లెక్సీలను తొలగించేందుకు వచ్చిన వీఎంసీ అధికారులను నేతలు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ఉందని సహకరించాలని అధికారులు బీజేపీ నేతలను కోరారు. పార్టీ కార్యాలయం గేటు లోపల ఉంటే మీకేంటని బీజేపీ నేతలు అధికారులను ప్రశ్నించారు. 

వైసీపీ కార్యాలయం ఫ్లెక్సీలు ఎన్నికల అధికారులకు కనపడటం లేదా అని నేతలు నిలదీశారు. బీజేపీ నేతల ఆందోళనతో అధికారులు వెనుతిరిగారు. తమ కార్యాలయం వద్దకు వచ్చి అధికారుల దౌర్జన్యం చేశారని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో రేషన్ బియ్యం వాహనాలపై సీఎం జగన్ ఫొటో ఉందని, వాటిని ముందు తొలగించండి అని మండిపడ్డారు. ఎన్నికల కోడ్​ని బీజేపీ గౌరవిస్తుందని, కానీ రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్న జగన్ ఫొటోను తీయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బీజేపీ సీనియర్ నేత నూతలపాటి బాల, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నరసరాజు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.