'ఈనాడు పత్రిక వల్ల వేల మందికి ఉపాధి - రామోజీ మన మధ్య లేకపోవడం బాధాకరం' - Distributors pay tribute to ramoji - DISTRIBUTORS PAY TRIBUTE TO RAMOJI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 10:15 PM IST

Telugu Magazines Distributors Pay Tribute to Eenadu Group Chairman Ramoji Rao : తెలుగు పత్రిక రంగానికి రారాజైన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మన మధ్య లేకపోవడం బాధాకరమని కరీంనగర్​ తెలుగు పత్రికల పంపిణీదారులు వెల్లడించారు. ఎన్ని పత్రికలు వచ్చినా గత ఐదు దశాబ్దాలుగా ఈనాడు పత్రిక సర్క్యూలేషన్​లో నంబర్​ 1గా నిలిచిందని అన్నారు. కరీంనగర్​ తెలుగు దినపత్రిక పంపిణీ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బస్టాండ్​ ఎదురుగా సుమారు 700 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. 

ఈనాడు పత్రిక వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమంది ఉపాధిని పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఈనాడు యూనిట్​ మేనేజర్​ యుగంధర్​ రెడ్డి, సర్క్యూలేషన్​ ఇంఛార్జి దత్తాత్రేయ, హెచ్​ఆర్​ ఇంఛార్జి అనంత్​రెడ్డితో పాటు నగరంలోని తెలుగు పత్రికల పంపిణీదారులు పాల్గొన్నారు. జూన్​ 8వ తేదీన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్​ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని రాజకీయ, సినీ రంగాలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.