ఫ్లోరిడా స్టూడెంట్ గవర్నమెంట్ ప్రెసిడెంట్‌గా విజయవాడ యువకుడు - Telugu Student Achievement in USA
🎬 Watch Now: Feature Video
Telugu Guy Elected as Student Government President in South Florida : చర్చించు, మెప్పించు అంతిమంగా విశ్వాసాన్ని పెంపొందించు. అప్పుడే విజయం వరిస్తుందనేది అమెరికా ఎన్నికల సూత్రం. అక్కడి విద్యార్థి సంఘాలు ఏటా నిర్వహించే ఎన్నికల్లో ఇదే పంథా అనుసరిస్తాయి. అలా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా స్టూడెంట్ గవర్నమెంట్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు తెలుగుతేజం గొట్టిపాటి సూర్యకాంత్ ప్రసాద్. ఈ పోటీలో పాల్గొన్నవారు అంతా విదేశీయులే అయినప్పటికీ తెలుగు వ్యక్తి విజయం సాధించడం గర్వకారణం.
విజయవాడకు చెందిన విద్యార్థి సూర్యకాంత్ ప్రసాద్ గొట్టిపాటి అమెరికాలో అరుదైన పదవిని దక్కించుకుని భారత కీర్తిని, తెలుగువారి గొప్పతనాన్ని అంతర్జాతీయంగా చాాాటారు. తన తండ్రి వల్లే తాను ఈ స్థాయికి చేరానంటున్నాడు సూర్యకాంత్ ప్రసాద్. ఇతడు ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. సూర్యకాంత్ సీఎస్‌సీ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. జెనరేటివ్ ఏఐ మీద కంపెనీ ఏర్పాటు చేయడమే తన ఆశయం అంటున్నాడు. ఇంతకీ ఈ పదవికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈ ఘనత ఎలా సాధించాడో సూర్యకాంత్ మాటల్లోనే విందాం.