కౌటింగ్ రోజు వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టాలి - ఎలక్షన్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ - TDP Training to Election Agents - TDP TRAINING TO ELECTION AGENTS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 2:55 PM IST

TDP Training to Election Agents For Votes Counting : మే 13 న పోలింగ్ ముగియడంతో జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై ఉసిగొల్పే విధంగా వ్యాఖ్యలు చేశారు. సజ్జల అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. దీంతో పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం అధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వైఎస్సార్సీపీ కుట్రలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని తెలిపారు.

పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం అధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, అశోక్ బాబు, పల్లె రఘునాథరెడ్డి తదితరులు టీడీపీ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చారు. కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలని, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఎలక్షన్ ఏజెంట్లకు సీనియర్ నేతలు పలు సూచనలు, సలహాలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేతలు వివరించారు. ఎలక్షన్ ఏజెంట్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చి దిశా నిర్దేశం చేయడం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.