బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భావం- వేడుకల్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు - TDP Formation Day Celebrations - TDP FORMATION DAY CELEBRATIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 7:12 PM IST

TDP 42nd  Formation Day Celebrations In Hyderabad: హైదరాబాద్​లో తెలుగుదేశం పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, టీడీపీ నేత సుహాసిని, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ఎన్టీఆర్ దార్శనికతను కొనియాడారు. తెలుగువాడి పౌరుషాన్ని దిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కీర్తించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని ఆయన తనయుడు రామకృష్ణ అన్నారు. 

తెలుగువాడి సత్తాను చాటిచెప్పడానికే పార్టీని స్థాపించారని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో  తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, ఎన్టీఆర్ ఆశయాల కోసం పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. తెలుగువాడి గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎన్టీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, నందమూరి హరికృష్ణ రథసారధిగా పార్టీ గెలుపు కోసం కృషి చేశారని సుహాసిని తెలిపారు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు సుహాసిని పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.