LIVE: తెలంగాణలో పది ఫలితాలు విడుదల - ప్రత్యక్ష ప్రసారం - Telangana 10th Results - TELANGANA 10TH RESULTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 10:59 AM IST
|Updated : Apr 30, 2024, 11:18 AM IST
Telangana 10th Results Live : తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు ఫలితాల విడుదలకు శ్రీకారం చుట్టారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరిగాయి. ఇందులో బాలురు 2లక్షల 57వేల 952 మంది కాగా, బాలికలు 2లక్షల, 50వేల 433 మంది పరీక్షలు రాశారు. సుమారుగా 30వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ 20లోపు మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. ఫలితాలను విడుదల చేయడం వల్ల సర్వర్ సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో ఈసారి అలాంటి సమస్యలు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరో వైపు సర్వర్ హ్యాంగ్ కాకుండా చూసుకుంటున్నారు. ఈ ఫలితాలను కోసం పదో తరగతి విద్యార్థులతో సహా వారి తల్లిదండ్రులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. మార్కులు లెక్కించేటప్పుడు ఎలాంటి టెక్నికల్ సమస్యలు రాకుండా విద్యాశాఖ అధికారులు ముందు నుంచే సన్నద్ధం అయ్యారు.
Last Updated : Apr 30, 2024, 11:18 AM IST