LIVE : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ - Deputy CM Bhatti Vikramarka Live - DEPUTY CM BHATTI VIKRAMARKA LIVE
🎬 Watch Now: Feature Video
Published : Sep 10, 2024, 3:29 PM IST
|Updated : Sep 10, 2024, 3:54 PM IST
Deputy CM Bhatti Vikramarka Press Meet Live : స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉందని, రాష్ట్రాలకు వచ్చే పన్ను వాటాను 41శాతం నుంచి 50 శాతానికి పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటి పథకాలని, ప్రజలకు ఆర్థిక భరోసా, భద్రతను కల్పిస్తాయన్నారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని భట్టి తెలిపారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరారు. సెస్‌లు, సర్‌ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఒక ప్రత్యేకమైన రాష్ట్రమని చారిత్రక కారణాల వల్ల అభివృద్ధిలో అసమానతలు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ, సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందన్నారు. అససమానతలు తొలగించడానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ప్రజాభవన్‌లో వేదికగా జరిగిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశంలోని పలు విషయాలను తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం వెల్లడిస్తున్నారు.
Last Updated : Sep 10, 2024, 3:54 PM IST