ఖమ్మం జిల్లాను కాంగ్రెస్‌ జిల్లాగా, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం : భట్టి విక్రమార్క - Deputy CM Bhatti Fires on KCR - DEPUTY CM BHATTI FIRES ON KCR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 11:04 PM IST

Bhatti Vikramarka On Election Campaign Pattern : ఈదేశంలో పుట్టిన అన్ని వర్గాల వారు ఒకే కుటుంబంగా ప్రేమగా జీవించాలని, అన్ని కులాల వారికి దేశ సంపదలో హక్కులు కలిగేలా చేయడమే రాహుల్‌ గాంధీ తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో, జిల్లాలోని ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచార సరళిపై చర్చించారు. ఒక ప్రణాళిక ప్రకారంగా అత్యధిక మెజార్టీ సాధించే దిశలో ముందుకు వెళ్లాలని నిర్ణయం చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి, కేసీఆర్‌ పర్యటనపై పలు విమర్శలు చేశారు.

Deputy CM Bhatti Fires on KCR : బీఆర్​ఎస్​ పదేళ్ల కాలంలో అప్పులతో రాష్ట్రం ఆర్థికంగా నాశనమైందని, వ్యవస్థలను కుప్పకూల్చి తగుదునమ్మ అంటూ ప్రభుత్వం కూల్చుతామని ప్రకటనలు చేయడం సిగ్గు చేటన్నారు. నాణ్యమైన కరెంటు, నీళ్లు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని, సమర్ధమైన పాలన అందిస్తుంటే ఇప్పుడు కేసీఆర్‌ అబద్దాలు చెబుతూ, దిగజారి ప్రచారం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సిగ్గులేకుండా కాంగ్రెస్‌పై వేస్తున్న అబంఢాలను ఖండిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ జిల్లాగా, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సీటితో పాటు రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులను ఎవరూ బయటకు పంపరని వారికి కరెంటు, నీళ్లు అందిస్తామన్నారు. వారు మంచిగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలని కోరుతున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.