LIVE : శాసనసభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - TELANGANA ASSEMBLY LIVE
🎬 Watch Now: Feature Video
Published : Dec 9, 2024, 10:35 AM IST
|Updated : Dec 9, 2024, 1:59 PM IST
Telangana Assembly Live : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శాసనసభ సమావేశాలల్లో ఏయే అంశాలు చర్చకు పెట్టాలి, ఏయే అంశాలు బిల్లులు రూపంలో సభలో పెట్టాలి అన్నది బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. రైతుల సమస్యలు, గురుకులాల్లో నెలకొన్న ఇబ్బందులు, లగచర్ల భూసేకరణ సమస్య, ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై వస్తున్న వ్యతిరేఖత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు అవుతున్న హామీలు, అమలు చేయాల్సిన హామీలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల ముందు ఐదు బిల్లులు, రెండు నివేదికలను పెడుతోంది.
Last Updated : Dec 9, 2024, 1:59 PM IST