LIVE : బడ్జెట్‌పై శాసనసభలో చర్చ - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video
Telangana Assembly Session 2024 Live : ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ఇవాళ ఉభయ సభల్లో చర్చ జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. జులై నెల వరకు అవసరాల కోసం రూ.78,911 కోట్ల పద్దును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రతిపాదించారు. ఈసారి బడ్దెట్‌లో ఆరు గ్యారంటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దానిపై నేడు శాసనసభ, శాసన మండలిలో చర్చ జరుగుతుంది.
చర్చతో పాటు ప్రభుత్వ సమాధానం కూడా ఇవాళ్టి ఎజెండాలో పొందుపరిచారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ వ్యయంపై చర్చ జరుగుతోంది. అవసరమైతే నీటిపారుదల, కృష్ణా జలాల అంశంపై కూడా శాసనసభలో చర్చ జరుపుతున్నారు. కాగా నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఇవాళ దానిపై కూడా అధికార, ప్రతిపక్ష నేతలు చర్చలు జరపనున్నట్లు సమాచారం.