మినిమం టైం స్కేలు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి:అధ్యాపకుల డిమాండ్ - ap latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2024/640-480-20622195-thumbnail-16x9-minimum-time-scale-employees.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 9:53 AM IST
Minimum Time Scale Employees : ముప్పై ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని మినిమం టైం స్కేలు అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల్ని రైగ్యులైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న తమను మాత్రం ప్రభుత్వం పక్కన పెట్టిందని వారు వాపోయారు.
అర్హత ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుల్ని క్రమబద్ధీకరిస్తే తమకు అభ్యంతరం లేదని, కొందరికి అర్హత లేకపోయినా, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు విరుద్ధంగా కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలు చేస్తున్నారని మినిమం టైం స్కేలు అధ్యాపకులు ఆరోపించారు. తమకు అన్యాయం జరుగుతుందంటూ వారు మీడియాకు తమ సమస్యలను వివరించారు. తమను రెగ్యులైజ్ చేయాలని గతంలో ఎందరో అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న మినిమం టైం స్కేలు అధ్యాపకుల్ని రెగ్యులర్ చేయాలని వారు కోరారు.