బ్యాలెట్లపై సీల్ లేదని ఉద్యోగుల ఓట్లు తిరస్కరిస్తే కోర్టుకెళ్తాం: ఎస్.రామకృష్ణ - Ramakrishna on Postal Ballots
🎬 Watch Now: Feature Video
Teachers Association President on Postal Ballot Counting: పోస్టల్ బ్యాలెట్లపై ఆర్వో సీల్ లేదని ఉద్యోగుల ఓట్లు తిరస్కరిస్తే కోర్టుకు వెళ్తామని మున్సిపల్ టీచర్ల సమాఖ్య అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ అన్నారు. బ‌్యాలెట్లపై సీలు, స్టాంపు వేయకపోవడం ఎన్నికల అధికారుల తప్పని వివరించారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్వోలు చేసిన తప్పునకు ఉద్యోగుల ఓట్లను చెల్లకుండా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు గురి కావద్దని ఎస్. రామకృష్ణ అన్నారు.
"బ్యాలెట్లపై సీల్ లేదని ఉద్యోగుల ఓట్లు తిరస్కరిస్తే కోర్టుకు వెళ్తాం. సీలు, స్టాంపు లేకపోవడం ఎన్నికల అధికారుల తప్పు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆర్వోలు చేసిన తప్పునకు ఉద్యోగుల ఓట్లను తిరస్కరించరించటం సరికాదు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు గురికావద్దు. దీంతోపాటు పోస్టల్ బ‌్యాలెట్ వ్యవహారంపై సిట్‌తో విచారణ చేయించాలని కోరుతున్నాం." - ఎస్. రామకృష్ణ, మున్సిపల్ టీచర్ల సమాఖ్య అధ్యక్షుడు