HUSBAND KILLS WIFE AND DAUGHTER: వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో ఓ వ్యక్తి భార్య, కుమార్తెను దారుణంగా హత్య చేశాడు. గ్రామనికి చెందిన గంగాధర్‌రెడ్డి తన భార్య శివలక్ష్మి, కుమార్తె గంగోత్రిని రాత్రి నిద్రిస్తున్న సమయంలో కొడవలితో దాడి చేసి చంపేశాడు. శివలక్ష్మి అంగన్వాడి కేంద్రంలో సహాయకురాలిగా పని చేస్తున్నారు.
ఉదయం 9 గంటలైనా శివలక్ష్మి విధులకు రాకపోవడంతో అంగన్వాడి కార్యకర్త ఫోన్ చేశారు. భర్త గంగాధర్ రెడ్డి ఫోన్ ఎత్తి తన భార్యను చంపేశానంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కుమార్తె గంగోత్రి 8వ తరగతి చదువుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే హత్యకు గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ గ్రౌండ్ - కత్తులు, రాళ్లతో దాడి