ETV Bharat / state

2 రోజుల పోలీస్​ కస్టడీకి వర్రా - 9న విచారణకు రావాలని రాఘవరెడ్డికి నోటీసులు - VARRA RAVINDER REDDY CASE

మధ్యాహ్నం నుంచి పోలీసుల అదుపులో రాఘవరెడ్డి - రాత్రి 9 గంటలకు రాఘవరెడ్డిని ఇంటికి పంపించేసిన పోలీసులు - ఈనెల 8, 9 తేదీల్లో కస్టడీకి వర్రా రవీందర్ రెడ్డి

YS_Avinash_Reddy_PA_Raghava_Reddy
YS Avinash Reddy PA Raghava Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2025, 5:14 PM IST

Updated : 19 hours ago

Avinash Reddy PA Raghava Reddy Detained: చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, అనితతో పాటు షర్మిల, సునీత, విజయమ్మలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైఎస్సార్సీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వెనకున్న కుట్రదారులను గుర్తించేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కడప కోర్టు అనుమతితో వర్రా రవీందర్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలో విచారించి కీలక అంశాలు రాబట్టాలని పులివెందుల పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇదే కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈనెల 9వ తేదీన విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.

గడిచిన నాలుగేళ్ల నుంచి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి, అతని వెనకున్న వారిని గుర్తించడానికి పనిలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈమేరకు అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలో విచారించి నిజాలు వెలికి తీసే అవకాశం ఉంది. ఈనెల 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్రాను కస్టడీలో విచారించుకోవచ్చని కడప నాలుగవ అదనపు జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది.

కుట్రదారులను గుర్తించేందుకు: ఈమేరకు బుధవారం ఉదయం 9 గంటలకు వర్రాను కడప జైలు నుంచి పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. నవంబర్ 8న ఐటీ, బీఎన్ఎస్, అట్రాసిటీ చట్టాల కింద వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని నవంబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై జిల్లాలో పది కేసులు, రాష్ట్రవ్యాప్తంగా 40 కేసులు ఉన్నాయి. పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో 71 మందిని నిందితులుగా చేర్చారు.

వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సజ్జల భార్గవ్ రెడ్డి సూచనల మేరకు అధికార పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇతని వెనకున్న కుట్రదారులను గుర్తించేందుకు వర్రాను రెండు రోజుల పాటు కస్టడీలో విచారించే అవకాశం ఉంది. వర్రాను న్యాయవాది సమక్షంలోనే విచారించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు: అదే విధంగా పులివెందుల పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ కోసమే స్టేషన్​కు పిలిపించామని పోలీసులు చెబుతున్నా, వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం అరెస్ట్ చేస్తారనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆరు సార్లు రాఘవరెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చి విచారించారు. ముందస్తు బెయిలు పిటిషన్ హైకోర్టు తిరస్కరించడంతో మంగళవారం మధ్యాహ్నం పులివెందులలో రాఘవరెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు వాహనంలో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు.

9వ తేదీన మళ్లీ విచారణకు రావాలి: పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పులివెందుల పోలీస్ స్టేషన్​కి చేరుకున్నారు. రాత్రి వరకు స్టేషన్​లోనే ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ మురళీనాయక్ ఉదయం నుంచి రాత్రి వరకు కడపలోనే ఉన్నారు. సునీత, షర్మిల, విజయమ్మలపై వర్రా రవీందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. ముగ్గురు మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి కంటెంట్ ఇచ్చింది రాఘవరెడ్డి అని వర్రా వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఫలితంగానే రాఘవరెడ్డిని ఈ కేసులో నిందితుడుగా చేర్చారు. అతని అరెస్టుకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా రాత్రి 9 గంటలకు రాఘవరెడ్డిని ఇంటికి పంపించి వేశారు. ఈనెల 9వ తేదీన మళ్లీ విచారణకు రావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు.

బుధవారం వర్రా రవీందర్ రెడ్డిని కస్టడీకి తీసుకున్న తర్వాత రిమ్స్​లో వైద్య పరీక్షలు పూర్తి చేసి విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతని వెనకున్న కుట్రదారుల వివరాలను రాబట్టేందుకు పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీలో లోతుగా విచారించే అవకాశం ఉంది. వర్రాను పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ విచారించనున్నారు. విచారణ నివేదికను ఈనెల 10వ తేదీన కడప కోర్టుకు సమర్పించనున్నారు.

"తెలియదు, గుర్తులేదు.. ఐడీ, పాస్​వర్డ్ మర్చిపోయా" - డీఎస్పీ అసహనం

Last Updated : 19 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.