వైఎస్సార్సీపీ ఫారమ్​-7 ఆగడాలు- అడ్డుకోవాలని ఈసీకి లేఖ - ఓటర్ల తుది జాబితా తప్పులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 3:45 PM IST

TDP Sharif Letter to EC about Srikalahasti voter list Mistakes : ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు దాదాపు 5 వేలకు పైగా ఫామ్-7 దరఖాస్తులు పెట్టారని కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission)  శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ. షరీఫ్​ లేఖ రాశారు. ఈ అంశంపై శ్రీకాళహస్తి తెలుగుదేశం ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సెక్​ (Securities and Exchange Commission) కి గతంలో ఫిర్యాదు చేశారని లేఖలో పేర్కొన్నారు. 

ఫామ్ -7 దరఖాస్తులు చేసిన వారికి ఓటర్ల సమాచారం తెలియదని కేవలం స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (MLA) ఆదేశాలతో వాటిని పెట్టారని మండిపడ్డారు. ఓటర్ జాబితాల నుంచి తమ పేర్లు ఎందుకు తొలగించారో ఓటర్లకు తెలియదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తొట్టంబేడులో తొలగించిన 79 ఓటర్ల జాబితాను లేఖకు (Voter List) షరీఫ్‌ జత చేశారు. ఫాం -7 దరఖాస్తుల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.