రాష్ట్రాభివృద్ధి కోసమే పొత్తులు- జగన్ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధం: మెుహమ్మద్ షరీఫ్ - Politbureau Member Mohammed Shariff
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 12:55 PM IST
TDP Politbureau Member Mohammed Shariff About TDP Alliances: తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోసమే పనిచేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యడు మెుహమ్మద్ షరీఫ్ అన్నారు. టీడీపీ పొత్తులు తప్పో ఒప్పో తర్వలో జరగబోయే ఎన్నికల్లో (Elections) ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్నికాపాడుకోవడానికే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని షరీఫ్ వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను ఇంటింటికి పంపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని షరీఫ్ స్పష్టం చేశారు.
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి (Corruption) తారా స్థాయికి చేరుకుందని, ఆంధ్రరాష్ట్ర పౌరుల జీవితాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని షరీఫ్ తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనం అయిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని షరీఫ్ వెల్లడించారు. మైనారిటీ సంక్షేమం కోసం టీడీపీ తీసుకొచ్చిన పథకాలను వైఎస్సార్సీపీ రద్దు చేసి మైనారిటీలను మోసం చేసిందని మండిపడ్డారు.