ఇళ్లు ఇస్తామని పిలిచి నిరాశగా పంపించడం బాధాకరం: నారాయణ - సీఎం జగన్పై టీడీపీ నారాయణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 7:11 PM IST
TDP Narayana Fire on YSRCP Govt: టీడీపీ హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను అధికారం చేపట్టి ఐదేళ్లయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం (YSRCP Govt) పంపిణీ చేయకపోవటం దారుణమని మాజీ మంత్రి నారాయణ అన్నారు. పైగా ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇన్నాళ్లుగా పట్టించుకోని జగన్ సర్కార్ ఇళ్లను ఇస్తామని పిలిచి, లబ్ధిదారులను నిరాశగా పంపించడం బాధాకరమని మండిపడ్డారు. నెల్లూరులోని మూడో డివిజన్లో 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ' (TDP Babu Surity Bavishattu Gaurantee Programme) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే నిరుపేదలందరికీ టిడ్కో గృహాలు పంపిణీ (Tidco Houses Distribution in AP) చేస్తామని నారాయణ ప్రకటించారు.
"టీడీపీ హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను వైఎస్సార్సీపీ అధికారం చేపట్టి అయిదేళ్లు అవుతున్నా ఇవ్వకపోవడం దారుణం. టిడ్కో ఇళ్లు ఇస్తామని పిలిచి లబ్ధిదారులను నిరాశగా పంపించడం బాధాకరం. టీడీపీ అధికారంలోకి రాగానే పేదలందరికీ టిడ్కో గృహాలు పంపిణీ చేస్తాం." - నారాయణ, మాజీ మంత్రి