వందల కోట్ల ప్రభుత్వ ధనంతో జగన్‌ సిద్ధం సభలు: బాలకృష్ణ - balakrishna election campaign - BALAKRISHNA ELECTION CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 9:55 PM IST

TDP Nandamuri Balakrishna Election Campaign: అవినీతికి చక్రవర్తిలా మారిన జగన్​ను ఇంటికి సాగనంపడానికి ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో ఆయన పాల్గొన్నారు. పటేల్ సెంటర్​లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి అరాచకాలు పెచ్చుమీరాయని, ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. 

కృష్ణా జలాలను చెన్నైకి తరలించిన ఘనత ఎన్టీఆర్ దేనని తెలిపారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ పథకాల రూపకర్త నందమూరి తారక రామారావు అని, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే చంద్రబాబును గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం మైనార్టీలు, దళితులు సహా అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని స్పష్టం చేశారు. వందల కోట్ల ప్రభుత్వ ధనంతో వైసీపీ సిద్ధం సభలు నిర్వహిస్తుందని విమర్శించారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారన్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి జగన్​ను ఇంటి పంపేందుకు సిద్ధంగా ఉండాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.