ప్రధాన ఇసుకాసురుడు సీఎం జగనే - ఎవరినీ వదిలిపెట్టేది లేదు: నక్కా ఆనంద్‌బాబు - illegal sand mining in ap

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 1:53 PM IST

Updated : Feb 22, 2024, 3:07 PM IST

TDP Nakka Anand Babu Comments: రాష్ట్రంలో ప్రధాన ఇసుకాసురుడు సీఎం జగనేనని తెలుగుదేశం సీనియర్ నేత నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. ఇసుక అక్రమ తవ్వకాలు వాస్తవమేనని, ఎన్జీటీలో (National Green Tribunal) కేంద్ర కమిటీ నివేదిక ఇవ్వడంపై వైసీపీ ప్రభుత్వం ఏం సమాధానమిస్తోందని ప్రశ్నించారు. ఇసుక అక్రమాలు జరగట్లేదని కలెక్టర్లు తప్పుడు నివేదికలు సమర్పించడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులేనని, తెలుగుదేశం- జనసేన వచ్చాక వారందర్నీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీ తీర్పులు కూడా లెక్కచేయట్లేదని ధ్వజమెత్తారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, యథేచ్ఛగా దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు. రీచ్‌ల్లో స్టాంపులు వేసి దొంగ బిల్లులు ఇచ్చేస్తున్నారని ఆనంద్ బాబు విమర్శించారు. 

ఎస్‌ఈబీ పోలీసులు, తహసీల్దార్లు ఏం చేస్తున్నారో తెలియట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల ప్రాంతంలో అడ్డగోలుగా మైనింగ్‌ జరుగుతోందని, అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. యథేచ్ఛగా ఇసుక తవ్వుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. భారీ యంత్రాలు పెట్టి అడ్డగోలుగా తవ్వేస్తున్నారని, అక్రమ తవ్వకాలకు సహకరిస్తే జైలుకు వెళ్లాల్సిందే అని అన్నారు. ఇసుక దోపిడీద్వారా జగన్ 50 వేలకోట్లు కొల్లగొట్టాడని దుయ్యబట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు జగన్ రెడ్డి తన ఇసుకదోపిడీని ఆపేలా లేడని ఆయన మండిపడ్డారు. ఎన్జీటీ చెప్పినా, హైకోర్టు ఆదేశించినా రాష్ట్రంలో ఇసుకదోపిడీ ఆగకపోవడానికి కారణం జగన్ రెడ్డేనని నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. 

Last Updated : Feb 22, 2024, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.