చంద్రబాబుపై పెట్టిన కేసులు పటాపంచలౌతున్నాయి : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు - Ashok Babu Comments on Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 12:09 PM IST
TDP MLC Ashok Babu Comments on Jagan in Vijayawada : సూర్య, చంద్రులకు పట్టిన గ్రహణాలు వీడినట్లు చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ పటాపంచలౌతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా ఎదురు దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. ఈ కేసు సెక్షన్ 420 కిందకి రాదని సుప్రీంకోర్టు తేల్చిన విషయాన్ని వ్యాఖ్యానించారు. ఇప్పుడైనా సైకో ముఖ్యమంత్రికి బుద్ధి రావాలని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన కేసుల్లో 3 వేల సార్లు ఎందుకు వాయిదాలు తీసుకుంటున్నారని అశోక్బాబు ప్రశ్నించారు. ప్రస్తుతం జగన్ చేస్తున్న దుర్మార్గాలపై రోజుకో కేసు పెట్టొచ్చని పేర్కొన్నారు. సాక్షులను విచారించకుండానే చంద్రబాబును అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. జగన్ కక్షపూరితంగానే చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే జగన్కు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీనే అధికార పగ్గాలు చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.