LIVE : వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు - ప్రత్యక్షప్రసారం - TDP MLAs Tribute to NTR - TDP MLAS TRIBUTE TO NTR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 9:37 AM IST

TDP MLAs Tribute to NTR : అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. అయితే శాసనసభ సమావేశాల మొదటి రోజు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి సభకు వెళ్లడం తెలుగుదేశం పార్టీ సంప్రదాయంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఉదయం సీఎం చంద్రబాబు నేతృత్యంలో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్నారు. సభ్యులంతా పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని ఇప్పటికే టీడీఎల్పీ సూచించింది. మొదటి రోజు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ వాయిదా అనంతరం స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ - బీఏసీ సమావేశం జరగనుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈనెల 26 వరకు అంటే 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. గవర్నర్‌ ప్రసంగంపై రేపు చర్చ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.