ఎలాంటి ప్రకటన లేకుండా మార్కెట్​ వేలంపాట - అడ్డుకున్న టీడీపీ శ్రేణులు - palamaneru market auction

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 5:41 PM IST

TDP Leaders Who Blocked the Agricultural Market Auction : చిత్తూరు జిల్లా వ్యవసాయ మార్కెట్​ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలమనేరు ​పరిధిలోని శివుని కుప్పం ఉప మార్కెట్ స్థలం వేలంపాటను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఎలాంటి ప్రకటన, నోటీసు​ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా వారికి కావాల్సిన వారికే స్థలాన్ని కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులకు లక్షల్లో డబ్బులు తీసుకుని లైసెన్స్​ జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం పలమనేరు వ్యవసాయ మార్కెట్​ను అభివృద్ధి చేస్తే, ప్రస్తుతం వైసీపీ మార్కెట్​ నిర్వహణ కూడా చూసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్జేడీని కలిసి వినతిపత్రం అందించారు. అందరికీ వేలంపాటలో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్​ చేశారు. తమకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. అనేక తర్జన భర్జన అనంతరం అధికారులు వేలంపాటను వాయిదా వేయడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.