అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను అడుకున్న టీడీపీ నాయకులు - Illegal soil mining in AP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 5:02 PM IST

Updated : Feb 25, 2024, 5:25 PM IST

TDP Leaders Stopped Vehicles Moving Soil Illegally: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరులో అక్రమంగా ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్న లారీలను తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. అనుమతులు మీరి మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని రోడ్డుపై నినాదాలు చేశారు. పుల్లూరు పొలాల్లోని మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. లారీలపై ఆన్ govt డ్యూటీ అంటూ పోస్టర్లు ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

అక్రమంగా మట్టిని తరలిస్తే ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు పాలడుగు దుర్గా ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పిడి సత్యన్నారాయణ కనుసన్నల్లో అక్రమ మట్టి రవాణా జరుగుతుందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధికారులు ఎవరూ స్పందించరనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు అక్రమ రవాణాకు తెరలేపి అక్రమార్జనకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

Last Updated : Feb 25, 2024, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.