ఐదేళ్ల వైసీపీ పాలనలో పల్నాడు రావణ కాష్టమైంది : యరపతినేని శ్రీనివాసరావు - Prajagalam Atma Gourava Meeting - PRAJAGALAM ATMA GOURAVA MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 11:55 AM IST
TDP Leaders Prajagalam Atma Gourava Meeting: ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో పల్నాడు ప్రాంతాన్ని రావణకాష్టంగా మార్చారని గురజాల కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీలను హత్యలు, మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేశారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ అరాచకాలకు శాంతి, అభివృద్ధితో సమాధానం చెబుతామని తెలిపారు. పల్నాడు జిల్లా గురజాల మండలం పిన్నెల్లిలో నిర్వహించిన ప్రజాగళం- ఆత్మగౌరవ సభలో యరపతినేని, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత గ్రామంలోకి నేతలు రావటంతో వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
తాను గత ఐదు సంవత్సరాలలో అవినీతి చేయలేదని, అక్రమ కేసులు బనాయించలేదని శ్రీకృష్ణ దేవరాయులు అన్నారు. ప్రజలకు కనిపించకుండా దూరం లేనని, డబ్బు అహకారంతో ప్రవర్తించలేదని పరోక్షంగా ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. శ్రీనివాసరావు, తాను ప్రత్యర్థులుగా ఉన్నా ఎన్నడూ పగలు, ప్రతీకారాల జోలికి వెళ్లలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. గురజాల నియోజకవర్గం అభివృద్ధి కోసమే పని చేశామని ఆయన గుర్తు చేశారు. పిన్నెల్లి గ్రామాన్ని రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. దాదాపు 90 మంది పులిచింతల నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.