చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల కూల్చివేత- ఘటన ప్రాంతానికి వెళ్లిన టీడీపీ నేతలు - TDP on Tidco Houses Demolition - TDP ON TIDCO HOUSES DEMOLITION
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 22, 2024, 5:10 PM IST
TDP Leaders on TIDCO Houses Demolition: తెలుగుదేశం ప్రభుత్వంలో పేదల కోసం కోట్ల రూపాయలతో నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి పార్టీ నేతలతో కలిసి ధ్వంసమైన నిర్మాణాలను పరిశీలించారు. రాష్ట్రంలో జగన్ విధ్వంస పాలన సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో చేసిన పనులను అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే చంద్రబాబుకు ఓట్లు వేసి ప్రజలు గెలిపించాలని వరదరాజుల రెడ్డి కోరారు.
"జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసపూరితమైనది. గత టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను కూల్చివేయటం దారుణం. మరోసారి జగన్ సీఎం అయితే రాష్ట్రాన్ని ధ్వంసం చేసేస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే చంద్రబాబుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాం." - వరదరాజుల రెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు అభ్యర్థి